Thursday, February 5, 2015

Gospel of Mark - Introduction

పరిచయము
నాలుగు  సువార్తలలో మార్కు సువార్తనే మొదట వ్రాయబడినది. మార్కు ఈ సువార్తను వ్రాసెను. ఇతను అపోస్తులుడైన బర్నబాకి మేనల్లుడు (కొలస్సి 4:10). ఇతని తల్లి పేరు మరియా. వీరి ఇంటిలోనే ఆనాటి క్రైస్తవ సంఘ సమావేశం ప్రారంభమాయెను.యేసు 12 మంది శిష్యులలో మార్కు ఒకడు కాదు గనుక జరిగిన వాటికి ఈయన ప్రత్యక్ష షాక్షి కాదు.  ఇతను పేతురు యొక్క ఆత్మీయ కుమారుడు మరియు పరిచారకుడు ( 1 పేతురు 5:13) గనుక యేసు పరిచర్య గురించి పేతురు వివరిస్తుండగా మార్కు వాటిని వ్రాయుచూ వచ్చెను .

మొదటి మిషనరీ ప్రయాణములో పౌలు మరియు బర్నబాతో జత కలిసి మార్గమధ్యలో వెనుదిరిగి వచ్చినది ఈ మార్కే (అపోస్తుల12:25;13:13).   కారణము చేతనే పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణములో మార్కును వెంట బెట్టుకొని పోవుటకు ఇష్ట పడలేదు ( అపోస్తుల 15:36-41). ఇదే విషయమై పౌలుకు మరియ బర్నాబాకు బేదాభిప్రాయము వచ్చి ఇరువురు విడిపోవుటకు కారణమైనది. బర్నబా మార్కును తన సొంత ఊరైన కుప్రకు వెంటబెట్టుకుని వెళ్ళెను. పౌలు అతనికి బదులుగా సీలను తీసుకెళ్ళేను. మార్కు విషయములో పౌలు బర్నబా ఇద్దరూ తప్పుగా వ్యవహరించారు. పౌలు ప్రకారము మార్కు మిషనరీ ప్రయాణమునకు సిద్ధముగా లేడు. అలాంటప్పుడు ఇరువురు కలసి ప్రభు మనసులో ఏముందో తెలుసుకోవలసింది. గుర్తుంచుకోండి, గర్వము బట్టే వ్యాజ్యము పుడుతుంది.

అటు తరువాత పౌలు మరియు మార్కు మధ్య సమాధానం ఏర్పడింది. కొలస్సి 4:10 లో చూస్తే  రోమాలో పౌలుతో పాటు మార్కు కనిపిస్తాడు. కాలం గడిచే కొద్ది మార్కు పౌలు మనస్సులో నమ్మకాని సంపాదించగలిగాడు. అందకే పౌలు మార్కును గురించి ఫిలోమేను 1:23 లో "నా జత పనివాడు" అని, తన జీవితములోని చివర దినాలలో, మార్కు "పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు" అని మెచ్చుకోనెను ( 2 తిమోతి 4:11).   
ఒక వేళ బర్నబా పౌలుకు లోబడి మార్కును వెంట పెట్టుకుని వెళ్ళుటకు ఇష్టపడక యుండినట్లైతే, పౌలు మరియు బర్నబా విడిపోయి ఉండేవారు కాదుఅలాగే పౌలుతో బర్నబా తన ప్రయాణమును అర్ధాంతరముగా ముగించేవాడు కాదుఅయితే క్రమ క్రమముగా బర్నబా కోరినట్టు, మార్కు పౌలుతో పాటు సేవలో రాగలిగాడు గాని బర్నబాకు అప్పటికే సమయము మించిపోయింది. మార్కు అపరాధము కొరకు తాను నష్ట పోవాల్సి వచ్చింది.

మార్కుతో బర్నబాకు ఉన్నది ఇహలోక భాంధవ్యము గనుక తరువాత ఇతను లేఖనములో ఎక్కడా మనకు కనిపించడు. అతని స్థానములో సీల వచ్చి అతని ఘనతను తీసుకొనెను. మనము వేచియుండటము నేర్చుకోగలిగితే దేవుడు సమస్తము చక్కదిద్దగలడు. ఇతరుల నిందను మన మీద వేసుకొని వారి పక్షముగా వ్యాజ్యమాడ కూడదులేదంటే అది మనలను నాశనము చేయునుమార్కు తన సేవా తొలి దినాలలో పరిచర్య భారమైనదిగా  భావించి యుండవచ్చు. అందుకే పౌలు మరియు బర్నబాతో కలసి మొదటి మిషనరీ  ప్రయాణములో  నిలుబడలేక వినుదిరిగెను. అటు తరువాత దేవుడు ఇతనిని క్రమ క్రమముగా మార్చుట ద్వారా నలుగురు సువార్తికులలో ( మత్తయి, మార్కు , లూకా మరియు యోహాను) ఒకనిగా చేసెను. ఇప్పుడు ప్రమంచమంతా ఇతనిని గుర్తిస్తున్నది. నేపధ్యం తెలుసుకోవటము మనకు చాలా ముఖ్యం. అనేకులు అపక్వము బట్టి ప్రారంభములో తప్పులు చేయవచ్చు. అయితే వారి తప్పుల విషయమై దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారి పరిస్థుతలను మార్చి వేయగలడు   

మార్కు జీవితము నుంచి మనము మరి ముఖ్యముగా నాయకులు తెలుసుకోవలసిన మరియొక ప్రాముఖ్యమైన పాటము ఏదనగా, పరిచర్యలో క్రొత్త వ్యక్తులకు ఒకే సారి ఎక్కువ భాద్యతలను ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. లేదంటే వారు వాటిని మోయలేకపోవచ్చుపౌలు మరియు బర్నబాతో కలిసి మొదటి మిషనరీ ప్రయాణము చేయుటకు తొలుత మార్కునకు పరిపక్వత లేక సిద్ధపాటు లేదు. అటు తరువాత ఇతను పేతురుచెఐగుప్తులోని అలక్సాంద్రియాకు మొదటి భిషప్పుగా ఉండుటకు  పంపబడెను. అతని మరణం గురించి చరిత్ర ఇట్లు చెప్పుచున్నది. సెరాపిస్ ( Serapis) అను దేవతకు భక్తితో చేయుచున్న పండుగను గూర్చి మార్కు వ్యతిరేకముగా మాట్లాడి నాడని అలెక్సాండ్రియా ప్రజలు అతనిని హింసించి, ముక్కలు ముక్కలగునట్లు ఈడ్చి చంపిరని

 తెలియజేయుచున్నది.అక్కడ అతను హతషాక్షి కాగా అతని బూడిదను Venice కు తీసుకురాగా Cathedral of San Macro లో దానిని భద్రపరచిరి. మార్కు ఫలవంతమైన పరిచర్య చేసి దేవుని మెప్పు పొందుకోనేను.       

No comments:

Post a Comment